Jdñews Vision..
రన్నరప్‌తో గట్టి పోరాటం తర్వాత, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కుమారి పి నాగమణి ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ 2024-2025 లో కాంస్య పతకాన్ని సాధించింది.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ 2024-2025 ఆధ్వర్యంలో సోమవారం 4 నవంబర్, 2024 న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, డా.వైఎస్‌ఆర్ కడప జిల్లా, పులివెందులలో ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ 14, 17 మరియు 19 ఏళ్ల లోపు వారికి నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో అనేక జిల్లాల నుంచి బాల బాలికలు పాల్గొన్నారు. విజేతలు గా నిలిచిన వారికి ఎమ్మెల్సీ భూమిరెడ్డి గోపాల రెడ్డి మెడల్స్ మరియూ పోటీలలో పాల్గొన్న వారికి ధ్రువపత్రాలను అందజేశారు. ఈ సందర్భం లో మా సీనియర్ ఎడిటర్, శ్రీ సూరజ్ ప్రకాష్ శర్మ తో కాంస్య పతక విజేత కుమారి నాగమణి మాట్లాడుతూ, తాను మధ్యతరగతి కుటుంబానికి చెందిన దానినని, ఆమె తల్లి స్వాతి మరియు తండ్రి నారాయణరావులు టెన్నిస్ పై చాలా ఆసక్తిని కలిగిన వారనీ, మరియు ఆర్థిక పరిస్థితుల కారణంగా, వారు ప్రత్యేక శిక్షణను అందించ లేక పోయారనీ, అయిననూ తల్లి తండ్రుల కోరికను సార్థకం చేయడానికి తను శ్రమించి ఈ పథకం సాధించానని తెలియజేసింది. తన భవిష్యత్తు ఆశయం ఏమిటని మా సీనియర్ ఎడిటర్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ, ఒలింపిక్స్‌లో పాల్గొని మన దేశానికి గోల్డ్ మెడల్ సాధించాలనేది తన కల అని తెలియ జేసింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.