Jdnews Vision…
విశాఖపట్నం, శ్రీకాకాకుళం-ఈరోజు, ఫిబ్రవరి 04: :
అరసవెల్లి రథపస్తమి వేడుకల్లో నిరంతరంగా శ్రీసూర్యనారాయణమూర్తిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు నిరంతరం అన్నదాన సేవ కొనసాగుందని ఉపకార్ ట్రస్ట్ చైర్మన్, ఏపీ ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షులు, సినీ నిర్మాత, ప్రముఖ సంఘ సేవకులు డా.కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శ్రీకాకుళంలో చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నప్రసాదసేవను ఆయన వర్చువరల్ గా తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్నసమారాధన నిరంతరాయంగా ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు వాలంటీర్లు చేపట్టారన్నారు. శ్రీకాకుళం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో అరసవెల్లి ఆదిత్యుని ఆలయానికి సమీపంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి అక్కడ భక్తులకు పాలు, టీ, కాఫీ, ఉప్మా, పులహోర, మజ్జిగ, పులిహోర, మంచినీరు అందించామన్నారు. ఈ ప్రత్యేక కౌంటర్ వద్ద సేవా వాలంటర్లను భక్తులకు అన్నప్రసాదాలను ఎంతో సేవా భావంతో అందించారని చెప్పారు. ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు దైవ సన్నిధిలో చేపట్టామని.. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణమూర్తిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు అల్పాహారం అందించే భాగ్యం కలగడం ఆనందంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో కూడా ఈ సేవను కొనసాగించనున్నామన్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులంతా చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న ఈ అన్నసమారాధనలో భక్తులు పాల్గొని అన్నపానియాలు పెద్ద సంఖ్యలో స్వీకరించడం ఆనందంగా ఉందన్నారు. ఆదిత్యుని దర్శనాల్లో అన్నసేవలో శ్రీకాకుళం పట్టణ అధ్యక్షులు తాళ్లూరి నవీన్, కుమార్, అనీల్, శరత్, రవి, సుబ్రమణ్యం, ప్రదీప్, గుల్సన్, మూర్తి పాల్గొని భక్తులకు ప్రసాదాలను అందజేశారు. స్వామివారి భక్తులకు ఇంత పెద్దఎత్తున అన్నదాన సేవ చేపట్టిన ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ చైర్మన్ డా.కంచర్ల అచ్యుతరావుకి శ్రీకాకుళం చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం అభినందనలు తెలియజేసింది.
