Breaking News

ఆత్మవిశ్వాసమే మహిళాప్రగతికి మూలం

Jdñews Vision…

ఆత్మవిశ్వాసమే మహిళాప్రగతికి మూలం

స్థానిక యం.వి.పి. కోలనీలో గాయత్రీ విద్యాపరిషత్ డిగ్రీ మరియు పి.జి. కళాశాల (అటానమస్) సమావేశ మందిరంలో లింగం వివక్ష అనే అంశం పై డిగ్రీ చదువుతున్న అమ్మాయిలకు. కళాశాలలో మహిళా అధ్యాపకులకు అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రావూరి వరలక్ష్మి. ప్రిన్సిపాల్.పి.జి.డిప్లొమా ఇన్ గైడెన్స్ అండ్ కాన్సిలింగ్ విచ్చేశారు.

ముఖ్య అతిథి తమ ప్రసంగంలో ఆడవాళ్లు పిరికితనం విడిచిపెట్టి. ఆత్మస్థైర్యంతో సమస్యలను ఛేదించి, సవాళ్లను ఎదుర్కోని, అడ్డంకులను అధిగమించి, ఆత్మన్యూనతా భావం విడిచిపెట్టి. తమ హక్కులపై అవగాహన పెంపొందించుకొని ముందటగు వేయాలని సందేశం అందించారు. స్ఫూర్తిని కలిగించారు.

ఈ కార్యక్రమంలో పత్రికా ప్రజాసంబంధాల అధికారిణి (PRO) శ్రీమతి డి.శేషపద్మగారు, డాక్టర్ పి.డి.లావణ్య. ఫిజిక్స్ విభాగం అధిపతి నేటి మహిళలు ఆత్మపరిశీలన తీసుకొని సాంఘికవ్యతిరేకశక్తుల ఆటకట్టించి మహిళల ఆత్మ గౌరవానికి ప్రాధాన్యత తో దేశపురోగతి లో భాగస్వాములు కావాలని ప్రసంగించారు.

ఆడపిల్లలు, మహిళలు సమాజంలో గౌరవింపబడినప్పుడు సర్వతోముఖ వికాసం సాధ్యమవుతుందని, వారిపట్ల చులకన భావం తగదని వక్తలు ప్రసంగిం చారు. అతిధులను వేదికపైకి డాక్టర్ జి. విజయలక్ష్మిగారు ఆహ్వానించి పరిచయం చేశారు. డాక్టర్ కె.అనిత కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశాన్నివివరించి సభాసంచాలకత్వం వహించారు. ఆడదంటే అబలకాదు సబల అని అన్నిరంగాలలో అభ్యదయం సాధించటం మహిళల జన్మహక్కుగా శ్రీమతి యు. వేదవతి వందన సమర్పణలో కార్యక్రమం ముగిసింది. మహిళలకు, యువతరానికి శ్రీ డి.గిరిధర్. డైరెక్టరు. యు.జి. కోర్సు లు,, ఆచార్య కె.యస్. బోస్ ప్రిన్సిపాల్ , గాయత్రి విద్యా పరిషత్,శుభాకాంక్షలు ప్రకటించారు

About admin

Check Also

मोटर सायकल चोरों के विरुद्ध बिलासपुर पुलिस का प्रहार…

Jdñews Vision… रणजीत सिंह की रिपोर्ट… जिला-बिलासपुर: : मोटर सायकल चोरों के विरुद्ध बिलासपुर पुलिस …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *