Jdnews Vision….
(విశాఖపట్నం-న్యూఢిల్లీ, విశాఖపట్నం)
ఢిల్లీలోని సమైఖ్య తెలుగు ఎంప్లాయిస్ అసోసియేషన్(సేవా) 20వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రముఖ సినిమా నిర్మాత, ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు చైర్మన్, టిడిపి నాయకులు, ఏపీ ఫిల్మ్ ఫెడరేషన్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు, ప్రముఖ సంఘసేవకులు డా.కంచర్లచ అచ్యుతారవు ముఖ్య అతిథఇగా పాల్గొంటున్నారు. ఈ మేరకు అసోయేషన్ ఆహ్వానం మేరకు ఆయన ఢిల్లీ బయలు దేరారు. అక్కడి ఏపీటీఎస్ భవన్ డా.బీఆర్ అంబేద్కర్ ఆడిటోరింయలో జరిగే కార్యక్రమంలో డా. ఆచ్యుతరావు పాల్గొంటారు. మధ్యాహ్నాం 2.30 గంటల నుంచి రాత్రి 8.30 వరకూ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. అక్కడే పలువురు ప్రముఖులకు అవార్డులు బహూకరించడంతోపాటు, క్యాలెండర్ ఆవిష్కరించడంతోపాటు, పలు సాంస్క్రుతి కార్యక్రమాలు, ఉపేంద్రగాడి అడ్డా స్పెషల్ షో అక్కడి తెలుగు ఎంప్లాయిస్ తోపాటు వీక్షిస్తారు. అనంతరం తిరిగి విశాఖపట్నం పయనం అవుతారు. ఈ సందర్భంగా డా.కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ, ఢిల్లీలోని సమైఖ్య తెలుగు ఎంప్లాయిస్ అసోసియేషన్ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. మంచి అసోసియేషన్ చేపట్టే కార్యక్రమాల ద్వారా తెలుగువారి సేవలు ఢిల్లీ వేదికగా వినిపించడానికి, ప్రదర్శించడానికి అవకాశం ఏర్పడిందన్నారు. అదే సమయంలో ఉపేంద్రగాడి అడ్డా సినిమా కూడా అక్కడి తెలుగు ఎంప్లాయిస్ కోసం ప్రదర్శించి సరికొత్త ఒరవడికి నాంది పలుకుతున్నట్టు ఆయన చెప్పారు. తెలుగువారు ఎక్కడున్నా వారి వైభవం అంతటా విస్తరించాలన్నదే తమ ఆకాంక్ష అని డా.కంచర్ల అచ్యుతారావు అభిప్రాయ పడ్డారు.
Check Also
साईं कुलवंत हॉल में क्रिसमस कैंडल लाइटिंग समारोह…
Jdñews Vision… प्रशांति निलयम का पवित्र परिसर दिव्य स्पंदनों से गूंज उठा जब श्री सत्य …