Breaking News

ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలతో వైభవంగా సాగిన ఉక్కునగరం శ్రీ సత్య సాయి మందిరం 24వ వార్షికోత్సవ వేడుకలు*

Jdñews Vision…

*శ్రీ సత్య సాయి సేవా సంస్థల నిస్వార్ధ సేవలు ప్రతి ఒక్కరికీ ఆదర్శవంతం – విశాఖ ఉక్కు కర్మాగారం డైరెక్టర్ ఫైనాన్స్ శ్రీ సి హెచ్ ఎస్ ఆర్ వి జి కె గణేష్*

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక మరియు సేవా కేంద్రం, ఉక్కునగరం 24వ వార్షికోత్సవ వేడుకలు తేదీ 22-12-24 ఈ రోజు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి.

తెల్లవారుఝామున ఓం కారం, సుప్రభాతం, నగరసంకీర్తన, హనుమాన్ చాలీసా పారాయణ, రుద్రాభిషేకం అనంతరం , మంగళ హారతి సమర్పించారు.

తరువాత ధనుర్మాసం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర్లు గారిచే గోపూజ(అంగాంగ పూజ ) జరుపబడింది. ఈ గోపూజ కార్యక్రమం లో అనేకమంది భక్తులు భక్తితో పాల్గొన్నారు.
అనంతరం నామసంకీర్తన(భజనలు) తరువాత “స్ఫూర్తి” కార్యక్రమం లో శ్రీమతి అయ్యగారి కౌసల్య, పూర్వ ప్రిన్సిపాల్, శ్రీ సత్య సాయి విద్యా విహార్ , MVP కాలనీ)గారిచే ఆధ్యాత్మిక ప్రసంగం జరిగింది. ఈ సందర్భంగా భక్తుల నుద్దేశించి మాట్లాడుతూ శ్రీమతి అయ్యగారి కౌసల్య భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి అనంత ప్రేమ, వారి దివ్య అనుగ్రహ ఆశీస్సుల గురించి వివరించారు. భగవంతుని పట్ల అచంచల మైన విశ్వాసంతో అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందవచ్చు అని ఆమె తెలిపారు. శ్రీమతి అయ్యగారి కౌసల్య తన మృదు మధురమైన భజనలు, కీర్తనలతో కూడా భక్తులను మైమరపించారు. ఈ సందర్భంగా శ్రీమతి అయ్యగారి కౌసల్య ను శ్రీ సత్య సాయి సేవా సంస్థల మహిళా విభాగం సభ్యులు ఘనంగా సన్మానించారు.

అనంతరం సాయంత్రం జరిగిన ఉక్కునగరం శ్రీ సత్య సాయి మందిరం 24వ వార్షికోత్సవ వేడుకల ప్రధాన కార్యక్రమానికి RINL విశాఖ ఉక్కు కర్మాగారం డైరెక్టర్ ఫైనాన్స్ శ్రీ సి హెచ్ ఎస్ ఆర్ వి జి కె గణేష్ విశిష్ట అతిధిగా విచ్చేసి శ్రీ సత్య సాయి సేవా సంస్థల విశాఖ జిల్లా అధ్యక్షులు శ్రీ పి ఆర్ ఎస్ ఎన్ నాయుడు తో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా విశాఖ ఉక్కు కర్మాగారం డైరెక్టర్ ఫైనాన్స్ శ్రీ సి హెచ్ ఎస్ ఆర్ వి జి కె గణేష్ మాట్లాడుతూ నిత్యం దీనులకు, సమాజం లో వెనుక బడిన వారికి నిస్వార్ధంగా సేవ చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటున్నందుకు ఉక్కునగరం శ్రీ సత్య సాయి సేవా సమితి భక్తులను, పదాధికారులను ప్రత్యేకంగా ప్రశంసించారు. శ్రీ సత్య సాయి సేవా సంస్థల నిస్వార్ధ సేవలు ప్రతి ఒక్కరికీ ఆదర్శవంతమని శ్రీ సి హెచ్ ఎస్ ఆర్ వి జి కె గణేష్ కొనియాడారు.

ఈనాటి సేవా కార్యక్రమం లో భాగంగా జీవనోపాధి కలిగించడానికి నిరుపేద మహిళకు విశాఖ ఉక్కు కర్మాగారం డైరెక్టర్ ఫైనాన్స్ శ్రీ సి హెచ్ ఎస్ ఆర్ వి జి కె గణేష్ విశిష్ట అతిధిగా విచ్చేసి శ్రీ సత్య సాయి సేవా సంస్థల విశాఖ జిల్లా అధ్యక్షులు శ్రీ పి ఆర్ ఎస్ ఎన్ నాయుడు తో కుట్టు మెషిన్ అందచేశారు. అవసరమైన వారికి శ్రీ సత్య సాయి అమృత కలశం (ఒక నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు . కిరాణా సామానులు ఉండే కిట్ ) అందచేశారు.
శ్రీ జి రామకృష్ణ తన కన్వీనర్ రిపోర్ట్ లో వార్షిక నివేదిక లో 2024 లో చేసిన అనేక సేవా కార్యక్రమాల వివరాలు అందరికీ తెలియచేసారు
శ్రీ సత్య సాయి సేవా సంస్థల విశాఖ జిల్లా అధ్యక్షులు శ్రీ పి ఆర్ ఎస్ ఎన్ నాయుడు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల ద్వారా సమాజం లో దీనులకు సేవ చేయడానికి ఎప్పుడు ముందుండే ఉక్కునగరం శ్రీ సత్య సాయి భక్తులను ప్రశంసించారు. ఉక్కునగరం శ్రీ సత్య సాయి సేవా మందిరం ద్వారా విశేష సేవలను అందిస్తున్న వారికి ఈ రోజు సన్మానం చేశారు
అనంతరం ఉక్కునగరం శ్రీ సత్యసాయి సేవా సమితి గాయని గాయకుల సంగీత విభావారి అందరినీ అలరించింది. కార్యక్రమం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారికి మంగళ హారతి తో ముగిసింది .

About admin

Check Also

पुलिस ने पूर्व मंत्री पेर्नी नानी और उनके बेटे पेर्नी किट्टू को नोटिस जारी किया

*कृष्णा जिला, मछलीपट्टनम:* पुलिस ने पूर्व मंत्री पेर्नी नानी और उनके बेटे पेर्नी किट्टू को …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *