జర్నలిస్టు భార్య వైద్యఖర్చులకు విశాఖ దానకర్ణుడు తక్షణ సహాయం
-రూ.10వేలు తక్షణ సహాయం అందజేసిన డా.కంచర్ల అచ్యుతరావు
(విశాఖపట్నం- మార్చి 13)
జర్నలిస్టులు, వారి కుటుంబాలకు ఎప్పుడు ఎక్కడ ఏ చిన్న ఆపద వచ్చినా టక్కున స్పందించే విశాఖ అపర దానకర్ణుడు, కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు, ఉపకార్ ఛారటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అధినేత, ప్రముఖ సంఘసేవకులు డా.కంచర్ల అచ్యుతరావు విశాఖలోని జర్నలిస్టు భార్య వైద్య సహాయానికి తక్షణమే రూ.10వేలు ఆర్ధిక సహాయం చేశారు. విశాఖలో ఓ లోకల్ కేబుల్ టీవిలో పనిచేస్తున్న శేఖర్ భార్యకు సీరియస్ అయ్యి ఐసీయూలో ఉంచారు. వెంటనే విషయం తెలుసుకున్న డా.కంచర్ల తక్షణ సహాయం, మందులు ఖర్చుల నిమిత్తం రూ.10వేలు అందజేశారు. ఈ సందర్భంగా డా.కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ, మీడియా అంటే తన కుటుంబమని.. తన కుటుంబ సభ్యులకు ఏమైనా జరిగితే అది నాకు చాలా బాధను కలిగిస్తుందన్నారు. సమాజంలో నాల్గవ మూలస్థంబంగా ఉన్న మీడియా, అందులో పనిచేసే జర్నలిస్టులకు ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా తనను సంప్రదించవచ్చునని చెప్పారు. జర్నలిస్టు శేఖర్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం వారి పరిస్థితిని కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు సమీక్షిస్తున్నారన్న ఆయన.. ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్దంగా ఉన్నానని భరోసా ఇచ్చారు. విశాఖలో ఏ మీడియాలో పనిచేసే జర్నలిస్టూ, కష్టకాలంలో ఎవరిపైనా ఆధార పడాల్సిన పనిలేదున్నారు. మీలో ఒకడిగా.. మీ కుటుంబ సభ్యుడిగా ఎల్లప్పుడూ మీ వెంట ఉంటానని, జర్నలిస్టులందరూ దైర్యంగా, మనో బలంతో నిబ్బరంగా ఉండాలని ఈ సందర్భంగా చెప్పారు. కాగా జర్నలిస్టు శేఖర్ కుటుంబానికి తక్షణమే డా.కంచర్ల ఆర్దిక సహాయం చేయడంపై నగరంలోని జర్నలిస్టు సంఘాలు హర్షం ప్రకటించాయి. మంచి మనసుతో జర్నలిస్టు కోసం లక్షల రూపాయలు సంక్షేమానికి ఖర్చుచేస్తున్న కంచర్ల సేవలను కొనియాడుతున్నాయి.
