Jdñews Vision…
వైద్యురంగంలో చరిత్ర సృష్టించిన విమ్స్
–రాష్ట్రంలోనే తొలిసారి ప్రభుత్వ ఆసుపత్రిలో లివర్ మార్పిడి శస్త్రచికిత్స
–క్లిష్టతరమైన శస్త్రచికిత్సను విజయవంతం చేసిన విమ్స్ వైద్యులు
–అవయువదానంతో 40 ఏళ్ల వ్యక్తికి పునర్‌జన్మ
–విమ్స్ వైద్యుల పనితీరు భేష్… ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
–అవయవదానంపై విస్తృత అవగాహన….విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు
విశాఖపట్నం: వైద్యరంగంలో ఎన్నో విఫ్లవాత్మక మార్పులు వస్తున్న క్రమంలో గతంలో ఎన్నూడూ జరగని విధంగా విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(విమ్స్) వైద్యుల బృందం క్లిష్టతరమైన శస్త్రచికిత్సలను సాహాసోపేతంగా నిర్వహించి అరుదైన రికార్డును సృష్టించారు.కేవలం కార్పోరేట్ ఆసుపత్రుల్లోనే జరిగే అత్యంత ఖరీదైన అవయువమార్పిడి సర్జరీలను ఆంధ్ర రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆసుపత్రిలోని వసతులను వినియోగించుకుంటూ లివర్ మార్పిడి శస్త్రచికిత్స చేపట్టి సరికొత్త చరిత్రను సృష్టించారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి కాలే యాన్ని స్వీకరించి 40 ఏళ్ల వయసు గల వ్యక్తికి విమ్స్ వైద్యులు విజయవంతంగా కాలేయాన్ని అమర్చారు..రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ ఆసుపత్రి విశాఖ విమ్స్‌లో లివర్ మార్పిడి చేసి నూతన రికార్డును సైతం నెలకొల్పారు.
ఈనెల 2వ తేదీన శ్రీకాకుళానికి చెందిన ఓ వ్యక్తి బ్రెయిన్ డెడ్ కావటంతో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు అవయవ దానంపై వివరించగా, వారు సైతం ఆవయువదానం చేసేందుకు ముందుకు వచ్చారు..దీనితో బ్రెయిన్‌డెడ్ అయిన ఆ వ్యక్తి నుంచి సేకరించిన కాలేయాన్ని.. ఈనెల 3వ తేదీన విమ్స్ ఆస్పత్రికి తరలించారు.. అప్పటికే లివర్ కోసం జీవన్‌ధార్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న 40 ఏళ్ల వ్యక్తికి ప్రాధాన్యత క్రమాన్ని పాటిస్తూ, పూర్తిగా కాలేయం పాడైపోయి తీవ్ర అనారోగ్యానికి గురైన వ్యక్తికి ఆయా లివర్‌ను అమర్చి పునర్జీవం పోశారు. విమ్స్ ఆస్పత్రి సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, అనస్తీసియా, జెనరల్ మెడిసిన్ విభాగానికి చెందిన వైద్య బృందాలు సమన్వయంతో కాలేయాన్ని సకాలంలో 40 ఏళ్ల వ్యక్తికి విజయవంతంగా అమర్చి ఆయా శస్త్రచికిత్సను విజయవంతం చేశారు.
–పూర్తిగా కోలుకున్న కాలేయం గ్రహీత
విమ్స్ ఆసుపత్రికి చెందిన వైద్యుల బృందం ఈ సంకిష్టమైన సర్జరీను విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు.. కాలేయం గ్రహీత అయిన 40 ఏళ్ల వ్యక్తి పూర్తిగా కోలుకునే విధంగా ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు పర్యవేక్షణలో వారి సూచనలు,సలహాలను పాటిస్తూ నిరంతరం పర్యవేక్షించి వైద్యసేవలందించారు.ప్రస్తుతం ఆయా వ్యక్తికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా 24 x 7 ప్రత్యేక వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని ఏర్పాటు చేసి త్వరగా కోలుకునే విధంగా ప్రత్యేక చర్యలను తీసుకున్నారు
–విమ్స్ వైద్యుల సేవలు భేష్..-రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్
కేవలం కార్పొరేట్ ఆసుపత్రులకు మాత్రమే పరిమితమైన అత్యంత కష్టమైన కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సను విమ్స్ ఆస్పత్రిలో నిర్వహించి విజయవంతం చేసి మరోసారి రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుకు,సమర్థతకు మచ్చుతునకగా నిలిచారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వైద్యుల పనితీరును ప్రశంసించారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి కాలేయం స్వీకరించి అవసరమైన వ్యక్తికి అమర్చి ఆపరేషన్ను ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించడం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చరిత్రలోనే తొలిసారి అని వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది సేవలను ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా ఈ సంక్లిష్టమైన సర్జరీను విజయవంతంగా పూర్తిచేసిన వైద్య బృందానికి… పర్యవేక్షించిన జీవన్ దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్, విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కే రాంబాబుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.. అలాగే అవయవదానానికి అంగీకరించిన కుటుంబ సభ్యులకు సైతం ధన్యవాదాలు తెలిపారు..
–ప్రత్యేక పరిస్థితుల మధ్య సర్జరీ చేసాం..
-డాక్టర్ కే రాంబాబు, జీవన్ దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్, విమ్స్ డైరెక్టర్
వైద్యరంగంలో కాలేయం మార్పిడి సర్జరీ అనేది చాలా సంక్లిష్టమైనది. ఈ సర్జరీ కోసం కొన్ని ప్రత్యేక పరిస్థితులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.. అవయవ గ్రహీతకు ఎటువంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా వైద్యపరీక్షలు నిర్వహించి, వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. అన్ని రకాలుగా ప్రత్యేక శ్రద్ధను తీసుకొని నిరంతరం పర్యవేక్షిస్తూ విజయవంతంగా కాలేయ మార్పిడి ప్రక్రియను పూర్తిచేశాం.. అవయవ గ్రహీత వారం రోజులు పాటు వైద్య బృందం పర్యవేక్షణలో ఉండటంతో పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారు.. ఇంత సంక్లిష్టమైన సర్జరీను విజయవంతంగా పూర్తి చేసిన విమ్స్ వైద్యుల బృందానికి నా ప్రత్యేక అభినందనలు.. ఏపీలో తొలిసారి ప్రభుత్వ ఆసుపత్రిలో కాలేయ మార్పిడి సర్జరీ చేసేందుకు ప్రోత్సహించిన ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, డీఎంఈ నరసింహం,గార్లకు కృతజ్ఞతులు తెలిపారు. అవయువదానంపై గ్రామ స్ధాయి నుంచి విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రజల్లో చైతన్యం వస్తే ఎంతో మంది అవయువల కోసం ఎదురుచూసే వారికి ఎంతో మేలు చేకూరుతుంది. ప్రతి ఆసుపత్రిలో జీవన్‌ధాన్‌పై సదస్సులు నిర్వహిస్తున్నాం.