Jdñews Vision…
విశాఖపట్నం : : ఈ రోజు అనగా తేది. 08.01.2025 న జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.పి.జగదీశ్వర రావు వారు పత్రికాముఖంగా తెలియచేయునది ఏమనగా హ్యూమన్ మెటా న్యూమో వైరస్ (HMPV వైరస్, కరోనా లాంటి) ప్రబలంగా వ్యాప్తి చెందుతుందని దీనివలన ప్రజలెవ్వరూ ఆందోళనకు గురి కావోద్దని తెలియచేసారు. మన రాష్ట్రము లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఈ వైరస్ కొత్తది కాదని, దీనివలన ఎవరూ భయపడనవసరం లేదని, తగు జాగ్రత్తలు పాటించినట్లయితే దీని నుండి కాపాడుకోవచ్చని తెలియచేసారు.
తదుపరి కరోనా మాదిరిగా గుంపులుగా ఉండరాదని, చేతులు తరచుగా 20 సెకన్ల పాటు సబ్బుతో శుభ్రపరచుకోవాలని, మాస్క్ ధరించాలని మరియు ముక్కు, నోటి ద్వారా వచ్చే తుంపరలు బయటకు వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు వహించాలని తెలియచేసారు.
ఈ వైరస్ సోకిన వారిలో దగ్గు, జ్వరం, జలుబు, దురద, ఆయాసం వంటివి, 5-6 సంవత్సరముల లోపు పిల్లలకు, మరియు 60 సంవత్సరములు దాటిన వృద్దులలో మరియు దీర్ఘకాలిక వ్యాదులైనటువంటి మధుమేహ వ్యాధిగ్రస్తులు, కీళ్ళ వ్యాధులు గల వారిలో మరియు వ్యాది నిరోధక శక్తి తక్కువ ఉన్నవారిలో ఈ వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉందని తెలియచేసారు. కనుక ప్రజలందరూ భయాందోళనలకు గురి కానవసరం లేదని సాదారణ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని పత్రికాముఖంగా తెలియచేసారు.