Jdñews Vision….
విశాఖ: నిరంతరం సమాజంలో జరిగే అన్యాయాలు, అక్రమాలు మంచి చెడుల కోసం వార్తలను రాసి ప్రజలను మేల్కొల్పే జర్నలిస్టు.. మరణించి కూడా నలుగురు జీవితాల్లో వెలుగులు నింపాడు.. తన కథనాల ద్వారా సమాజంలోని అపోహలను పోగొట్టే జర్నలిస్టు.. తన మరణంతో అవయవాలను దానం చేసి ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రయత్నించారు… ఇంటి పెద్దను కోల్పోయిన జర్నలిస్టు కుటుంబం.. మరో నాలుగు కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముందుకు వచ్చి సమాజంలో అందరికీ స్ఫూర్తిదాయకమయ్యారు..
సింహాచలం ప్రాంతంలో పలు పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేసిన మురళీ కృష్ణ (52) ఈ నెల 14వ తేదీన ద్విచక్ర వాహనంపై బంధువుల ఇంట్లో ఒక కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో స్టీల్ ప్లాంట్ వద్ద స్పీడ్ బ్రేకర్ వద్ద జారి పడటంతో స్పృహ కోల్పోయరు.. తీవ్రంగా బ్రెయిన్ లో రక్తస్రావం జరగడం వలన దగ్గరలో ఉన్న కిమ్స్ ఐకాన్ హాస్పిటల్‌కి తరలించారు. అతన్ని రక్షించడానికి రెండు రోజుల పాటు వైద్యులు ఎంతో శ్రమించారు,అయినప్పటికీ అతని ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించటంతో మంగళవారం బ్రెయిన్ డెడ్ అయినట్లుగా వైద్యులు ప్రకటించారు. ఆ తర్వాత అవయవదానంపై వైద్య బృందం వారి కుటుంబ సభ్యులు భార్య, , కుమార్తె, కుమారుడు, బంధువులకు అవగాహన కల్పించిన అనంతరం.. వారి అంగీకారం తెలిపారు… ఈ విషయాన్ని రాష్ట్ర జీవన్ దాన్ కోఆర్డినేటర్ డాక్టర్ రాంబాబుకు సమాచారం ఇవ్వగా ఆయన అవయవాలు సేకరించేందుకు అనుమతులను జారీ చేశారు.. మురళి నుంచి రెండు కిడ్నీలు (మూత్రపిండాలు), కాలేయమూ, గుండె వైద్య బృందం సేకరించింది. సేకరించిన అవయవాలను జీవన్ దాన్ ప్రోటోకాల్ ప్రకారం సీనియార్టీ జాబితాను అనుసరించి అవయవాలను కేటాయించడం జరిగింది…గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన నగర పోలీస్ శాఖ సహకారంతో అవయవాలను ఇతర ఆస్పత్రికి తరలించారు.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున విశాఖపట్నం ఆర్డీవో.. , రాష్ట్ర జీవన్ దాన్ కోఆర్డినేటర్ డాక్టర్ కే రాంబాబు ఆస్పత్రికి చేరుకొని మురళీకృష్ణ పార్థవదేహానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మురళీకృష్ణ అంతక్రియలకు రూ . 10 వేలు, ప్రశంసా పత్రాన్ని అందజేశారు.. చనిపోతూ మరో నలుగురు జీవితాల్లో వెలుగులు నింపినందుకు గర్వంగా ఉందని మృతిని కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానిక ప్రజలు వారి కుటుంబ సభ్యులను అభినందించారు.
అపోహలు వీడి అవయవ దానం చేయాలి…
-డాక్టర్ కె రాంబాబు, జీవన్ దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్
అవయవ దానంపై విస్తృతంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇంకా ప్రజల్లో ఏదో తెలియని అపోహ ఉంది.. తద్వారా బ్రెయిన్ డెడ్ అయినా సరే అవయవాలు దానం చేసేందుకు ముందుకు రావడం లేదు.. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది అవయవాల కోసం ఎదురుచూసే వారి సంఖ్య పెరుగుతుంది.. మురళీ కుటుంబ సభ్యుల వలె ప్రతి ఒక్కరూ అపోహలను వీడి అవయవాల కోసం ఎదురుచూసే మరికొందరికి అవయవ దానం చేసి వారి జీవితాల్లో నూతన వెలుగులు నింపేందుకు ముందుకు రావాలి. . అవయవ దానం కు ముందుకు వచ్చిన మురళి కుటుంబ సభ్యులతో పాటు వారిని ప్రోత్సహించిన వైద్య బృందం.. అవయవాలు తరలించేందుకు సహకరించిన పోలీస్ శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు..